TS : బీఆర్ఎస్ కు షాక్...మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా

TS : బీఆర్ఎస్ కు షాక్...మాజీ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి రాజీనామా

లోక్ సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కు రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. పార్టీలో సముచిత స్థానం దక్కకపోవటంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు

నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్దికి కోసం పాటుపడ్డాను. నాపై ఎటువంటి మచ్చలేకున్నా.. గత ఎన్నికల్లో నన్ను కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయినా మీ మీద విశ్వాసంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఎంపీ ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందని ఆశించాను. మాటమాత్రం చెప్పకుండా, ఎటువంటి చర్చ లేకుండానే రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ మాత్రం నా తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్‌కు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అవకాశవాద ఎంపీలను గెలిపించటం కంటే.. ఉద్యమ సహచరుడు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. కావునా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునా.' అని సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

భేతి సుభాష్‌ రెడ్డి 2001లో బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ గా పని చేశాడు. భేతి సుభాష్‌ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ పై 14169 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ పై 48, 168 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. చివరి నిమిషం వరకు ప్రయత్నించినా.. ఆయనకు నిరాశే దక్కింది. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వటంతో అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story