Laptop : గ్రేట్.. పోగొట్టుకున్న ల్యాప్ టాప్ అప్పగింత

Laptop :  గ్రేట్..  పోగొట్టుకున్న ల్యాప్ టాప్  అప్పగింత

పొగొట్టుకున్న ల్యాప్ టాప్ ను కొద్ది గంటల్లోనే గుర్తించి బాధితురాలికి అప్పగించారు బోరబండ పోలీసులు. డీఐ భూపాల్ గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెంగిచర్లకు చెందిన ప్రియాంక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. గురువారం ఆమె వినాయకనగర్ ఉంటున్న తన తల్లిని కలిసేందుకు ఆటోలో వచ్చిన ఆమె మోతీనగర్ వద్ద ఆటో దిగింది. హడావిడిలో తన ల్యాప్టాప్ ఆటోలోనే మరిచి పోయింది.

దీనిపై బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన డీఐ సిబ్బందితో కలిసి మోతీనగర్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా సదరు ఆటో మహేష్ నాయక్ చెందినదిగా గుర్తించారు. తుక్కుగూడలో ఉన్న అతడిని పిలిపించి ప్రియాంకకు ల్యాప్ టాప్ ను అప్పగించారు. తక్షణమే స్పందించిన డీఐ భూపాల్ గౌడ్, హెచ్పీ కృష్ణ, కాని స్టేబుల్ రవిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story