TS : ఎమ్మెల్సీ కవితపై సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు

TS : ఎమ్మెల్సీ కవితపై సుకేశ్ చంద్రశేఖర్  సంచలన ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Scam) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై (Kavitha) మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ‘లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది. బూటకపు, రాజకీయ కేసులని ఆమె చేసిన వాదన అబద్ధమని తేలింది. నెయ్యి డబ్బాలంటూ ఆమె చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుంది. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో బీఆర్ఎస్ రూ.వేల కోట్లు దాచింది’ అని తీహార్ జైలు నుంచి లేఖ రాశాడు.

‘మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, సీఎం కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది’ అని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఏడు రోజుల కస్టడీలో భాగంగా నేడు మూడో రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు.. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో, సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే అంశంపై సస్పెన్స్‌ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story