TS : కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి : హరీశ్ రావు

TS : కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి :  హరీశ్ రావు

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర సరకుల ధరల కొండెక్కాయి. పింఛన్లు రావడం లేదనన్నారు హరీష్ రావు. దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పింఛను అన్నీ పోయాయన్నారు. మహాలక్ష్మి గ్యారంటీ మహా మోసం. మీరు వినోద్‌ను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్‌కు ఏం చేశారని హరీష్ ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు హరీష్ రావు. ఆయన పాలనలో మెడికల్ కాలేజీలు, నిరంతర కరెంటు, కేసీఆర్ కిట్టు.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ప్రాజెక్టులు కట్టింది.. పనులు చేసింది మేమే. ప్రత్యేక ప్యాకేజ్‌ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే కరెంటు మోటార్లు కాలుతున్నాయని తెలిపారు. రేవంత్ చేసిందేమీ లేదని.. అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story