TS : యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల పూజలు

TS : యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల పూజలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు

యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ఆ పార్టీ నాయకులు కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి రోజు స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story