Mega DSC : మెగా డీఎస్సీ .. తొలి రోజు 282 దరఖాస్తులు

Mega DSC : మెగా డీఎస్సీ  ..  తొలి రోజు 282 దరఖాస్తులు

డీఎస్సీ (DSC) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు సోమవారం సాయంత్రం వరకు 282 దరఖాస్తులు వచ్చాయి. పాఠశాల విద్యాశాఖ డిటైల్డ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జిల్లాల వారీగా పోస్టులు, దర ఖాస్తు ప్రక్రియ విధానం, రిజర్వేషన్లు తదితర పూర్తి అంశాలతో మార్గదర్శకాలను జారీ చేశారు. కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతో నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. 11062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటించింది ప్రభుత్వం.

వాటిలో 2,629 స్కూల్‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌, 6508 సెకండరీ గ్రేడ్‌‌‌‌ టీచర్లు, 727 భాషా పండితులు, 182 పీఈటీ పోస్టులు ఉన్నాయి. వాటితో పాటు స్పెషల్ టీచర్ల కేటగిరిలో 796 ఎస్జీటీ, 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈనెల 4 నుంచి వచ్చే నెల 3 వరకూ ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్​లో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. కాగా, సోమవారం తొలిరోజు సాయంత్రం వరకూ 288 మంది అప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు.

డీఎస్సీ అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు, వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ సపోర్ట్ కోసం 91541 14982, 63099 98812 నంబర్లు ఇచ్చారు. దీంతో పాటు helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌‌‌‌ ద్వారా సమస్యను వివరించవచ్చని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story