TS : తెలంగాణలో 95, 235 ఇందిరమ్మ ఇండ్లు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

TS : తెలంగాణలో  95, 235 ఇందిరమ్మ ఇండ్లు..  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రాష్ట్రవ్యాప్తంగా 95 వేల 235 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 57 వేల 141 ఇండ్లు, అర్బన్ ఏరియాల్లో 38 వేల 94 ఇండ్లకు అనుమతి ఇస్తున్నట్టు జీవో 6 విడుదల చేసింది. ఇండ్ల నిర్మాణానికి హడ్కో నుంచి 3 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలుండగా, తొలిదశలో ఒక్కో సెగ్మెంట్ కు 800 ఇండ్లు శాంక్షన్ చేసిదంది.

ఇందిరమ్మ ఇండ్ల స్కీంను ఈ నెల 11న భద్రాచలం నియోజకవర్గం బూర్గంపహాడులో నిర్వహించే బహిరంగసభలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

వీక్ సెక్షన్ హౌసింగ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన హడ్కో అన్ని రాష్ట్రాల్లో ఇండ్ల నిర్మాణానికి రుణాలు ఇస్తుంటుంది. గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూంలకు రుణం ఇచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3 వేల 5 ఇండ్లు కేటాయిస్తామని బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజావాణిలోనూ ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 85 లక్షల అప్లికేషన్లు వచ్చియి.

Tags

Read MoreRead Less
Next Story