TS : తెలంగాణ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

TS : తెలంగాణ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ లోని లా కాలేజీల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ ఎల్‌సెట్ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిన్నటి తోనే గడువు ముగియగా, అభ్యర్థుల వినతి మేరకు మరో 10 రోజులు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఆలస్యరుసుం లేకుండా అభ్యర్థులు ఏప్రిల్‌ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.విజయలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు, ఐదేళ్ల LLB, రెండేళ్ల LLM కోర్సుల కోసం జూన్ 3న ప్రవేశ పరీక్ష జరగనుంది.

మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరేందుకు జూన్‌ 3న ప్రవేశపరీక్ష జరగనుంది. లాసెట్‌కు దరఖాస్తు రుసుం రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600); పీజీఎల్‌ సెట్‌కు రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900) చొప్పున అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది.

లా సెట్ లో కనీస మార్కుల అర్హత శాతం 35% అంటే మొత్తం 120 మార్కులలో 42 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులుక కనీస అర్హత మార్కులు నిర్దేశించలేదు. TS PGLCET-2024 ప్రవేశ పరీక్షలో కనీస మార్కుల అర్హత శాతం 25% అంటే మొత్తం 120 మార్కులలో 30 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులుక కనీస మార్కుల అర్హత శాతం ఉండదు.

Tags

Read MoreRead Less
Next Story