TG రిజిస్ట్రేషన్లు .. ‘TG 09 0001’ నెంబర్‌కు రూ.9.61లక్షలు

TG రిజిస్ట్రేషన్లు ..  ‘TG 09 0001’ నెంబర్‌కు  రూ.9.61లక్షలు

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కొత్త వాహనాలకు TGతో నిన్న రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఖైరతాబాద్‌, టోలిచౌకి, మలక్‌పేట, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, బండ్లగూడ, తిరుమలగిరి, అత్తాపూర్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌లో కొత్త కోడ్‌తో అధికారులు రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. అయితే.. తొలి రోజే వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆసక్తి చూపించారు. ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ‘TG 09 0001’ నంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహనదారుడు రూ.9.61లక్షలు వెచ్చించారు. రాజీవ్ ఫ్యాన్సీ నెంబర్‌కు పెట్టిన ధరతో మరో కారు కొనేయెచ్చు. ఒక్క ఖైరతాబాద్‌లోనే ఒక్కరోజులో రూ.30.49లక్షలు ఆదాయం వచ్చింది.

‘TG 09 0909’ అనే నంబర్‌ రూ.2.30లక్షలు పలికింది. ఈ నెంబర్ ను భవ్యసింధు ఇన్‌ఫ్రా సంస్థ రూ.2.30 లక్షలు చెల్లించి నెంబర్‌ దక్కించుకుంది. ‘టీజీ 09 0005’ నెంబర్‌ కోసం శాని్వతారెడ్డి అనే వాహన యజమాని రూ.2.21 లక్షలు చెల్లించారు. ‘టీజీ 09 0002’ నెంబర్‌ కోసం దుశ్యంత్‌ రెడ్డి అనే వాహనయజమాని రూ.1.22 లక్షలు చెల్లించారు.

అలాగే ‘టీజీ 09 0369’ నెంబర్‌కు రూ.1.20 లక్షలు, ‘టీజీ 09 0007’ నెంబర్‌ కోసం రూ.1.07 లక్షల చొప్పున చెల్లించి సొంతం చేసుకున్నారు. కాగా ఫీజు, ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రూ.2.51 కోట్ల ఆదాయం రాగా.. అందులో రూ.1.32 కోట్లు మూడు జిల్లాలనుంచే సమకూరడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story