Tips : కరెంట్ బిల్ భారీగా వస్తోందా.. ఈ టిప్స్ తో తగ్గించుకోండి

Tips : కరెంట్ బిల్ భారీగా వస్తోందా.. ఈ టిప్స్ తో తగ్గించుకోండి

సమ్మర్ లో కరెంట్ బిల్లు ఎక్కువ రావడం సహజమే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు 24 గంటలు నడుస్తూనే ఉన్నాయి. గృహ జ్యోతి పథకం కింద కాంగ్రెస్ సర్కార్ 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నప్పటికీ వేసవికాలంలో బిల్లు లిమిట్ దాటిపోతూఉంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే బిల్లు తగ్గించుకోవచ్చు.. గృహజ్యోతిలోకి వెళ్లొచ్చు.

చాలామంది స్విచ్ ఆన్ చేసి అవసరం లేని సమయంలో ఆఫ్ చేయడం మర్చిపోతున్నారు. మీ అవసరం తీరిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవడం మరిచిపోవద్దు. స్మార్ట్ టీవీలను చాలామంది రిమోట్ తోనే ఆఫ్ చేస్తున్నారు. TV స్టాండ్ బై మోడ్ లోకి వెళ్లి కరెంట్ వినియోగం బ్యాక్ గ్రౌండ్ లో అవుతూనే ఉంటుంది. అందుకే మెయిన్ స్విచ్ నే ఆఫ్ చేయాలి.

ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలను వాడండి. అవి వాడితే.. సగానికి సగం కరెంట్ బిల్లు తగ్గుతుంది. ఇదే కాదు.. ఫ్రిజ్, కూలర్.. ఏదైనా ఐదు నక్షత్రాల వస్తువును కొనుక్కోండి. వాటి లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story