Jatara : వనదుర్గా మాత ఏడు పాయల జాతర.. ప్రత్యేకత తెలుసుకోండి

Jatara : వనదుర్గా మాత ఏడు పాయల జాతర.. ప్రత్యేకత తెలుసుకోండి

మెదక్ జిల్లాలోని (Medak) ఏడుపాయల వన దుర్గా మాత దేవాలయం గురించి చాలామందికి తెలుసు. శివరాత్రి (Shivaratri) వేళ ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటుుంటారు. పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువై ఉంది. గోదావరి నదికి ఉపనది అయినా మంజీరా.. ఏడు ఉప నదుల సంగమం. అలాంటి ప్రత్యేకమైన చోట ఈ గుడి వెలిసింది. శివ సమేత అమ్మవారు కొలువయ్యారు కాబట్టే దీనికి ఏడుపాయల జాతర అని ప్రజాదరణ పొందింది.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో ఈ నెల 8 నుండి 10 వరకు మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మెదక్ పట్టణం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల ఆలయం ఉంటుంది. మంజీరా నదిలో స్నానాలు చేసి.. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రంగా, మేడారం తర్వాత అంత పెద్ద జాతరగా ఇది విరాజిల్లుతోంది.

మహాభారతం నాటి పురాణ కథ ఒకటి తెలుసుకుందాం. తండ్రి పరీక్షిత్ మహారాజు సర్పకాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో.. అర్జునుడి మనుమడు జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. జమదగ్ని,అత్యేయ ,కశ్యపి,విశ్వమిత్ర,వశిష్ట,గౌతమి,భరద్వాజ వంటి సప్తఋషులు యాగం నిర్వహిస్తారు. ఫలితంగా పాములన్ని అగ్నికి ఆహుతి అవుతుండడంతో భయపడి సర్పజాతి దేవుళ్లను మొర పెట్టుకుందట. అప్పుడు సర్పజాతికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు పాతాళంలోని గంగను ఇక్కడికి తీసుకువచ్చాడని.. అది గంగానది ఏడుపాయలుగా చీలిందని చరిత్ర ప్రాశస్థ్యం. గంగానది ఏడు పాయలుగా చీలిపోవడం,ఏడుగురు ఋషులతో యాగం చేయడం వలన దానికి ఏడుపాయల అని,అక్కడ దుర్గామాత కొలువై ఉండటం వలన అమ్మవారికి ఏడుపాయల దుర్గామాతగా చరిత్రకెక్కింది. ఏడుపాయల జాతర శివరాత్రి సందర్భంగా ఇక్కడ 8న మహాశివరాత్రి ఉత్సవాలు,9న బండ్లు ఊరేగింపు, 10న రథోత్సవం వైభవంగా జరుగుతాయి.

Tags

Read MoreRead Less
Next Story