TS : ఎవరీ మారేపల్లి సుధీర్ కుమార్ ... కేసీఆర్ ఈయనకే ఎందుకు టికెట్ ఇచ్చారు ?

TS : ఎవరీ మారేపల్లి సుధీర్ కుమార్ ... కేసీఆర్ ఈయనకే ఎందుకు టికెట్ ఇచ్చారు ?

వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసీఆర్ (KCR) తన నిర్ణయం మార్చుకున్నారు. తొలుత తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన గులాబీ బాస్.. తాజాగా డా.మారేపల్లి సుధీర్ కుమార్ (Marepalli Sudheer Babu)పేరును ప్రకటించారు. సుధీర్ కుమార్ ప్రస్తుతం హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నారు.

హన్మకొండ జిల్లా వాసి,మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా ఎంపిక చేసిన కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యుల ఏకగ్రీవ ఆమోదంతోనే ఎంపిక చేసినట్టు సమాచారం. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా కీలక భూమిక పోషించిన ఆయన, పార్టీకి విధేయుడిగా పనిచేశాడు.

కడియం కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను ఉండబోనని కేసీఆర్ కు లేఖ రాసి పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరు, అలాగే స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు అధినేత పరిశీలిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా తాటికొండ రాజయ్య పేరును ఖరారు చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

కడియం శ్రీహరిని, ఆరూరి రమేష్‌ను ఎదుర్కోవాలంటే.. క్షేత్రస్థాయిలో మంచి ఫాలోయింగ్, పలుకుబడి ఉన్న నేత అయితేనే కరెక్ట్ అని భావించిన కేసీఆర్.. సుధీర్ పేరును ప్రకటించినట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ వ్యూహం ఏంటన్నది ఎన్నికల్లో తెలుస్తుంది. వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story