TS : బర్రెలక్కకు ఓట్లు పడతాయా.. మద్దతు ఎంతవరకు ఉంది..?

TS : బర్రెలక్కకు ఓట్లు పడతాయా.. మద్దతు ఎంతవరకు ఉంది..?

నాగర్ కర్నూల్ లోక్ సభలో కొదమ సింహాల్లా ప్రధాన పార్టీలు కొట్లాడుతున్నాయి. మల్లురవి, ఆర్ఎస్ ప్రవీణ్, పోతుగంటి భరత్ లు పోటీలో ఉన్నారు. ఇదే టైంలో యూట్యూబ్ ఫేమ్ బర్రెలక్క అలియాస్ శిరీష కూడా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శిరీషకు కేవలం 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు ఆమె చుట్టూ వందల మంది మూగుతున్నారు. ఆమె చేసే ప్రచారాన్ని తమ వ్యూస్ గా మార్చుకుంటున్నారు. ఐతే.. కొందరు ఆమెకు సాయంగా నిలబడుతూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇవేవీ.. వ్యక్తిగతంగా బర్రెలక్కకు మాత్రం లబ్ధి చేకూర్చడం లేదు.

ఇష్యూస్ ను సీరియస్ గా అడ్రెస్ చేయలేకపోవడం శిరీష మైనస్. అందుకే ఆమెను సీరియస్ అభ్యర్థిగా పరిగణించడం లేదు. ఈ లెక్కన బర్రెలక్కకు పడే ఓట్లు ఎన్ని అనేది ఎవరైనా అంచనా వేయొచ్చంటున్నారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story