TS : శ్రీరామనవమి .. హైదరాబాద్ లో వైన్స్ బంద్

TS : శ్రీరామనవమి .. హైదరాబాద్ లో వైన్స్ బంద్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ జంటనగరాల్లో ఇవాళ వైన్ షాప్స్ మూసి ఉండనున్నాయి. జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. తిరిగి రేపు వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. మరోవైపు శోభా యాత్ర సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మల్లింపులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ చెప్పారు.

మరోవైపు సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పెళ్లితంతు మొదలు కానుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆర్టీసీ 238 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్థానికంగా వసతి కష్టంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story