Shocking Video : కాళ్లు నాకించుకున్న సీనియర్లు.. బడిలో షాకింగ్ వీడియో

Shocking Video : కాళ్లు నాకించుకున్న సీనియర్లు.. బడిలో షాకింగ్ వీడియో

పేరుకే అమెరికా కానీ.. అత్యంత దరిద్రమైన సంఘటనలన్నీ అక్కడే జరుగుతాయి. అమెరికాలోని కొందరు పాఠశాల విద్యార్థులు ఓ షాకింగ్ పని చేశారు. ఓక్లహోమాలోని డీర్ క్రీక్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ స్నేహితుల పాదాలపైన ఉన్న పీనట్ బటర్ నాకారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

స్కూల్ ఈవెంట్‌లో భాగంగా జిమ్‌లోని ఫ్లోర్‌పై పడుకుని ఇలా చేశారు. ఆన్‌లైన్‌లో చాలా మంది ఈ వీడియోపై ఆగ్రహం, అసహ్యం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలా చేయడం సరికాదని, అనారోగ్యకరమన్నారు. ఓక్లహోమా స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ వీడియోను చూసి దానిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సూపరింటెండెంట్, ర్యాన్ వాల్టర్స్ వీడియో చూశాక తాను షాక్ అయ్యానని ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.

ఫిబ్రవరి 29న జరిగిన ఒక ఈవెంట్ నుంచి ఈ వీడియో వచ్చింది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చే కాఫీ షాప్ కోసం నిధుల సేకరించడానికి ఉద్దేశించి ఈ ఈవెంట్ నిర్వహించారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.. కాఫీ షాప్‌ కోసం డబ్బులు సేకరించేందుకు ఇలా చేయాలని ఎంచుకున్నారు. చాలా డబ్బు వసూలు అయింది కానీ.. వీడియో కాంట్రవర్సీ అయింది. స్కూల్ లీడర్లు తల్లిదండ్రులకు, విద్యార్థులకు సారీ చెప్పాల్సి వచ్చింది.



Tags

Read MoreRead Less
Next Story