చనిపోయిందనుకున్నారు.. నేచురల్ సీపీఆర్ తో లేచిన మహిళ

చనిపోయిందనుకున్నారు.. నేచురల్ సీపీఆర్ తో లేచిన మహిళ

ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఓ వృద్ధురాలు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత ఆమెను తన సొంత రాష్ట్రం తీసుకెళ్లారు. అలా బీహార్‌లో అడుగుపెట్టగానే అద్భుతంగా ఆమె బతికి వచ్చింది. ఆ మహిళ బెగుసరాయ్‌లోని నీమా చంద్‌పురా గ్రామానికి చెందిన రాంవతి దేవిగా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కుమారులు మురారీ షావో, ఘనశ్యామ్ షావోలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లింది.

ఫిబ్రవరి 11న, మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఛత్తీస్‌గఢ్‌లోని కోర్వా జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు.

దీంతో ఆమె కుమారులు ఆమెను స్వగ్రామంలో దహనం చేయాలని నిర్ణయించుకుని.. ఫిబ్రవరి 12న ఒక ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని బెగుసరాయ్‌కు తీసుకువెళ్లారు. వారి 18 గంటల ప్రయాణం తర్వాత బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చేరుకోగా రాంవతి అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చింది.

మొదట్లో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు పక్కనే వాహనాన్ని ఆపి ధైర్యం చేసుకుని ఆమెను చెక్ చేశారు. ఆమెను సజీవంగానే ఉందని గుర్తించిన తర్వాత, వారు బెగుసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమెను రోడ్డు మార్గంలో తీసుకువస్తుండగా, వాహనం కుదుపులకు లోనై కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)గా పనిచేసి స్పృహలోకి వచ్చిందని వైద్యులు తెలిపారు. "ఆమెను ఐసీయూలో చేర్చామని, కోలుకుంటుంది" అని అన్నారు. CPR అనేది ప్రాణాలను రక్షించే టెక్నిక్. ఇది ఒకరి శ్వాస లేదా హృదయ స్పందన ఆగిపోయిన అనేక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story