Elon Musk : ఎలాన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ మరో సంచలనం

Elon Musk : ఎలాన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ మరో సంచలనం

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెర తీశాడు. ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ సంస్థ మరో అద్భుతాన్ని ప్రదర్శించింది. న్యూరాలింక్ మైక్రోచిప్‌ను మెదడులో అమర్చుకున్న తొలి పేషెంట్ తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రించగలిగి.. ఆన్‌లైన్‌లో చెస్, వీడియో గేమ్ ఆడారు.

ఎలాన్ మస్క్ బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ గురువారం తన సత్తా చాటుకుంది. తన మొదటి రోగి న్యూరాలింక్ పరికరాన్ని ఉపయోగించి తన ఆలోచనల ద్వారా ఆన్‌లైన్ చెస్, వీడియో గేమ్‌లను ఆడగలడని చూపించింది. రోగికి చిప్‌ అమర్చినట్టు వైరల్ అయిన వీడియో చూస్తే అర్థం అవుతుంది.

29 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ డైవింగ్ ప్రమాదంలో భుజం క్రింద పక్షవాతానికి గురయ్యాడు. తన ల్యాప్‌టాప్‌లో చెస్ ఆడుతూ, న్యూరాలింక్ పరికరాన్ని ఉపయోగించి కర్సర్‌ను కదిలించాడు. కర్సర్ స్క్రీన్ చుట్టూ కదులుతున్నట్లు మీరందరూ చూశారుగా.. దాన్ని నేను మెదడుతో నియంత్రించా. అద్భుతం కదా.. " అని లైవ్ స్ట్రీమ్ టైంలో ఆయన చెప్పాడు. మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించే ప్రక్రియను అర్బాగ్ వివరిస్తున్నట్లు వీడియో కూడా చూపించింది. న్యూరాలింక్ అధ్యయనంలో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అర్బాగ్ కూడా చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story