Japan : మీకు జపాన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Japan : మీకు జపాన్ గురించి ఈ విషయాలు తెలుసా?

* జపాన్ అంటే సూర్యుడు ఉదయించే భూమి. 6800 ద్వీపాల సముదా యమే జపాన్.

* ఈ దేశంలో పురుషుల ఆయుప్రమాణం 78 ఏళ్లు అయితే.. మహిళల ఆయు ప్రమాణం 84 ఏళ్లు. ఇకపోతే వందేళ్లు బతికిన వాళ్లు ఇక్కడ 90 వేల మంది ఉన్నారు.

* ప్రపంచంలోనే కచ్చితమైన సమయానికి రైళ్లు నడిపించే దేశమిది. అల స్యమయితే మహా 18 సెకన్లు మాత్రమే ఉంటుంది. 'షింకాన్సేన్' అనే బుల్లెట్ రైల్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. • ఇక్కడ చతురస్రాకారంలో ఉండే పుచ్చకాయలు దొరుకుతాయి. పిల్లలకంటే పెట్స్ అధికంగా ఉండే దేశమిది.

* రోబోటిక్స్, ఆటోమేషన్లో ఈ దేశం అడ్వాన్స్ గా ఉంటుంది. అసిమో హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది ఈ దేశానికి చెందిన సంస్థ హోండా.

* ట్రావెలర్స్ నిద్రపోవటానికి 'పాడ్స్' అనే చిన్న ఇళ్లలాంటివి ఉంటాయి. వీటిని క్యాప్సూల్ హోటల్స్ అని పిలుస్తారు.

* యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇక్కడ 19 ఉన్నాయి. ఇవన్నీ 17 శతాబ్దానికి చెందినవే.

* పసిఫిక్ సముద్రం దగ్గర ఉండే ఈ దేశంలో భూకంపాలు, సునామీల తాకిడి ఎక్కువ. భూకంపాలు జపాన్లో సర్వసాధారణం. సంవత్స రంలో 1500 భూకంపాలు వస్తాయి ఇక్కడ. వీటికి తగినట్లే ఇళ్ల నిర్మాణం ఉంటుంది.

* ఇక్కడ అధికార భాష జపనీస్. కరెన్సీ పేరు 'యన్'. రాజధాని పేరు టోక్యో, సుమో ప్రెస్టింగ్ ఇక్కడ పాపులర్ గేమ్.

* ప్రపంచంలోనే అతి తక్కువ క్రైమ్ రేట్ ఉండే దేశమిదే.

* ఇక్కడ 67 శాతం అడవులు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్, జూడో, కరాటే.. లకు పెట్టింది పేరు.

* ప్రపంచంలోనే అతి శుభ్రంగా ఉండే దేశమిదే. వీధుల్లో చెత్త కూడా కనిపించదు. ఎందుకంటే అన్ని వయసుల వాళ్లు తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి వలెంటీర్లుగా పని చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story