వెల్లుల్లిని జీతంగా.. ఎక్కడో తెలుసా

వెల్లుల్లిని జీతంగా.. ఎక్కడో తెలుసా
కమ్మటి చారు పెట్టాలన్నా, కాకరకాయ వేపుడు చేయాలన్నా కచ్చితంగా వెల్లుల్లి ఉండాల్సిందే..

కమ్మటి చారు పెట్టాలన్నా, కాకరకాయ వేపుడు చేయాలన్నా కచ్చితంగా వెల్లుల్లి ఉండాల్సిందే.. వెల్లుల్లిలో ఆరోగ్య లక్షణాలే కాదు, మంచి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. అందుకే వెల్లుల్లి ధర ఆకాశాన్ని అంటుతున్నా కొనేవారికి కొదవలేదు.

దేశంలో వెల్లుల్లి ధర క్రమంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వెల్లుల్లిని జీతంగా ఇచ్చే దేశం ప్రపంచంలో ఒకటుందని తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.. వెనుకటి తరాల్లో జీతంగా పండించిన ధాన్యం ఇచ్చే వారని తెలుసుకానీ, వెల్లుల్లి కూడా ఇస్తారని ఇప్పుడే కదా తెలుసుకోవడం.. మరి అది ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం..

వెల్లుల్లి యొక్క మొదటి సాగు

వెల్లుల్లిని 5,000 సంవత్సరాల క్రితం మధ్యధరా తీరంలో సుమేరియన్లు మొదటిసారిగా పండించారు. ఇది కాస్పియన్ సముద్రం యొక్క తూర్పు మైదానాల నుండి వచ్చింది. వెల్లుల్లి సాగు వేల సంవత్సరాల క్రితం మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చింది. చరిత్ర ప్రకారం, వెల్లుల్లి భారతదేశంలో 4500 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. భారతదేశంలో, హరప్పా కాలంలో 2600-2200 BC మధ్య సింధు లోయలోని ఫర్మానాలో వెల్లుల్లి గింజలు కనుగొనబడ్డాయి.

జీతంగా వెల్లుల్లి

క్రీస్తుపూర్వం 1325లో ఈజిప్టులోని టుటన్‌ఖామున్ సమాధిలో వెల్లుల్లి దొరికింది. దానిని శాస్త్రవేత్తలు భద్రపరిచారు. వెల్లుల్లి 7,000 సంవత్సరాలకు పైగా ఔషధ మొక్కగా, ఆహార వనరుగా ఉపయోగించబడేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టులో పిరమిడ్లు నిర్మించే కార్మికులకు జీతంగా కూడా ఇచ్చారని చరిత్రలో పేర్కొన్నారు. ఒకసారి వెల్లుల్లి లేకపోవడంతో పని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. ఈజిప్టులో ఇది చాలా విలువైన వస్తువుగా పరిగణించబడింది. ఈజిప్టులో తయారు చేసిన మమ్మీలతో పాటు వెల్లుల్లిని కూడా భద్రపరచడానికి బహుశా ఇదే కారణం. చారిత్రిక పత్రాలలో దాని తొలి ప్రస్తావన వచ్చింది. ఇది BC ఆరవ శతాబ్దంలో సంకలనం చేయబడిన జొరాస్ట్రియన్ పవిత్ర రచనల సమాహారం.

ఇక నీరో ఆధ్వర్యంలోని గ్రీక్ ఒలింపియన్ల నుండి రోమన్ గ్లాడియేటర్ల వరకు అథ్లెట్లు తమ శక్తిని పెంచుకోవడానికి వెల్లుల్లిని తినేవారట. వేల సంవత్సరాల క్రితమే వెల్లుల్లి ఆరోగ్య ప్రదాయిని అని తెలుసుకున్నారు. క్రీస్తుపూర్వం నాల్గవ సహస్రాబ్దిలో దీని సాగు ప్రారంభమైంది. వెల్లుల్లి యొక్క పురాతన అవశేషాలు ఇజ్రాయెల్‌లోని ఐన్ గెడి వద్ద ఉన్న గుహ నుండి 4000 BC (మధ్య చాల్‌కోలిథిక్ కాలం) లో కనుగొనబడ్డాయి.

చైనాలో అత్యధికంగా సాగు చేస్తున్న వ్యవసాయం వెల్లుల్లి

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వెల్లుల్లిలో 73.8 శాతం చైనా ఉత్పత్తి చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంది. భారత్ 10.4 శాతంతో రెండో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 1.7 శాతంతో మూడో స్థానంలో ఉంది. 2021 సంవత్సరంలో, చైనా 20.45 మిలియన్ టన్నులకు పైగా పచ్చి వెల్లుల్లిని ఉత్పత్తి చేసింది. చైనీస్ వెల్లుల్లి యొక్క ప్రత్యేకత దాని రెబ్బలు భారత దేశంలో సాగు చేసే వెల్లుల్లి కంటే నాలుగు రెట్లు మందంగా ఉంటాయి.

భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో వెల్లుల్లి సాగు

భారత్‌లో వెల్లుల్లి ఉత్పత్తి గత 25 ఏళ్లలో 2.16 లక్షల టన్నుల నుంచి 8.34 లక్షల టన్నులకు పెరిగింది. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ మరియు హర్యానా దేశంలో వెల్లుల్లిని ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు. ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఖరీదు ఎక్కువగా ఉంది.

వైద్య ఉపయోగం

ఈజిప్ట్, జపాన్, చైనా, రోమ్, గ్రీస్ వంటి వివిధ సంస్కృతులలో వెల్లుల్లిని సాంప్రదాయ ఔషధం కోసం ఉపయోగిస్తారు. పచ్చి వెల్లుల్లి రుచిని మరియు సువాసనను అందిస్తుంది. వెల్లుల్లిని వియత్నాం, థాయ్, మయన్మార్, లావో, కంబోడియన్, సింగపూర్, చైనీస్ కుకరీలో విరివిగా ఉపయోగిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story