Iran vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు!

Iran vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు!

ఇజ్రాయెల్ ఊహించినంత పనిచేసింది. ఇరాన్ దాడికి ప్రతిగా వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ దాడి ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ విమానాశ్రయం దగ్గర్లో జరిగింది. ఇజ్రాయెల్ ఇంకా దీనిని ధృవీకరించలేదు.

రాడార్ ప్రకారం.. పేలుళ్ల తర్వాత చాలా విమానాలు ఇరాన్ గగనతలం నుండి దారి మళ్లించబడ్డాయి. సుమారు 8 విమానాల మార్గాలను దారి మళ్లించారు. ఇరాన్‌లోని చాలా విమానాశ్రయాలలో విమానాలు రద్దు చేయబడ్డాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్ విమానాశ్రయాల్లో సర్వీసులు నిలిచిపోయాయి.

ఐతే.. ఇజ్రాయెల్ క్షిపణి దాడి వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. తమ అణు కేంద్రాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని ఇరాన్ తెలిపింది. ఇరాన్ బలగాలు అనేక ఇజ్రాయెలీ డ్రోన్‌లను కూల్చివేశాయని తెలిపింది. ఏప్రిల్ 14న ఇరాన్ 300కు పైగా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఈ సమయంలో ఇరాన్.. ఇజ్రాయెల్ నెవాటిమ్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని 300 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. దీంతో.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story