ఉద్యోగాల్లేవ్.. కెనడాలో క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న భారతీయులు

ఉద్యోగాల్లేవ్.. కెనడాలో క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న భారతీయులు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్-కెనడా సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో ఇక్కడ విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్-కెనడా సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో ఇక్కడ విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు.

2022లో, మొత్తం 226,450 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కెనడాకు చేరుకున్నారు. కెనడాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచిందని సర్వేలు చెబుతున్నాయి. గ్లోబల్ ఎడ్యుకేషన్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ ఎరుడెరా ప్రకారం, కెనడాలోని ఉన్నత విద్యతో సహా మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 807,750. కాగా వీరిలో 551,405 మంది కెనడాలో గత సంవత్సరం స్టడీ పర్మిట్ పొందారు.

ఇప్పుడు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు భారత్-కెనడా మధ్య విభేదాల గురించి ఆలోచించడం లేదు. వారి చదువులు పూర్తయిన తరువాత ఉద్యోగాలు వస్తాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు.

గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని పలువురు భారతీయ విద్యార్థులు ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. "ఇక్కడ మెడికల్ డిగ్రీలు పొందిన అనేక మంది భారతీయ విద్యార్థులు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు రాక, క్యాబ్‌లు నడుపుతున్నారు. మాల్స్, రెస్టారెంట్లలో పని చేస్తున్నారు.టొరంటో, కెనడా చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసించడం విద్యార్థులకు కష్టంగా మారుతోంది. అధిక జీవన వ్యయం వలన ఇరుకైన గదులలో నివసిస్తుంటారు. గత నెలలో కెనడా పార్లమెంట్‌లో ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.

జూన్ 18న కెనడియన్ గడ్డపై ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. నిజ్జర్ హత్యకు, భారత ప్రభుత్వ ఏజెంట్లకు మధ్య సంబంధం ఉందని కెనడియన్ భద్రతా ఏజెన్సీలు ఆరోపించినట్లు ట్రూడో పేర్కొన్నారు. ఈ అభియోగాన్ని భారత్ నిర్ద్వద్యంగా తోసి పుచ్చింది. ట్రూడో ఆరోపణ తర్వాత దౌత్యపరమైన గొడవలు చెలరేగాయి. అనేక మంది దౌత్యవేత్తలను తన మిషన్ల నుండి ఉపసంహరించుకోవాలని గత వారం ప్రారంభంలో భారతదేశం కెనడాను కోరింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, పరస్పర దౌత్యపరమైన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశంపై భారతదేశం తన వైఖరిని సమీక్షించబోదని స్పష్టమైన సూచనను ఇచ్చింది. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి మార్కెట్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ అయిన ICEF ప్రకారం, డిసెంబర్ 2022 చివరి నాటికి యాక్టివ్ స్టడీ పర్మిట్‌లతో 320,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 47 శాతం వృద్ధి. "2022 చివరి నాటికి కెనడాలోని ప్రతి పది మంది విదేశీ విద్యార్థులలో దాదాపు నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నారు" అని ICEF తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story