Elections : ఎలక్షన్‌లో జైలు నుంచే పోటీ చేస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాది

Elections : ఎలక్షన్‌లో జైలు నుంచే పోటీ చేస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాది

అమృత్ పాల్ సింగ్.. ఈ పేరు ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్ ఆయన. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. ఐతే.. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు.

పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వత్రంత్య అభ్యర్థిగా అమృత్ పాల్ పోటీ చేయనున్నాడు. త్వరలోనే అతడు నామినేషన్ కూడా దాఖలు చేస్తాడని తెలుస్తోంది. ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్‌లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. అమృత్ పాల్ తరఫు న్యాయవాది రాజ్ దేవ్ సింగ్ ఖల్సా ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.

అమృత్ పాల్ సింగ్ తండ్రి టార్సెమ్ సింగ్ దీనిపై స్పందించారు. 'అమృత్ పాల్‌ను తాను చాలా కాలంగా కలవలేదనీ.. ఎన్నికల్లో అతడు పోటీ చేస్తున్న విషయం తనకు తెలియదనీ చెప్పాడు. అమృత్ సర్ లో చేసిన విధ్వంసం కేసులో 2023 ఏప్రిల్ 23న పంజాబ్​లోని మోగా జిల్లాలో అమృత్ అరెస్ట్ అయ్యాడు. నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదై ఉంది.

Tags

Read MoreRead Less
Next Story