Missing : కెనడాలో పాకిస్తాన్ ఎయిర్ హోస్టెస్లు మిస్సింగ్!

Missing : కెనడాలో పాకిస్తాన్ ఎయిర్ హోస్టెస్లు మిస్సింగ్!

పాకిస్తాన్ ఎయిర్ హోస్టెస్లు(Pakistan Air Hostesses) కెనడాలో (Canada) అదృశ్యమవుతున్న ఘటన సంచలనంగా మారింది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్ హోస్టెస్లు వరుసగా అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. గతనెలలో ఒకరు కనిపించకుండా పోగా, తాజాగా మరో మహిళా సిబ్బంది తప్పిపోయారు. గతేడాది నుంచి మొత్తం తొమ్మిది మంది కనిపించకుండా పోయారు. ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన పీకే 782 విమానంలో మరియం రజా అనే ఎయిర్ హోస్టెస్ విధుల్లో ఉన్నది.

టోరంటోలో దిగిన ఆమె, మరుసటి రోజు కరాచీ రావాల్సిన విమానంలోవిధులకు హాజరుకాలేదు. దాంతో ఆమె బసచేసిన గదిని అధికారులు తనిఖీ చేశారు. అక్కడ యూనిఫామ్ తో పాటు.. థ్యాంక్యూ.. పీఏఐ అని రాసివున్న లేఖను గుర్తించా రు. మరియం రజా గత పదిహేనేళ్లుగా పీఏఐలో పనిచేస్తున్నది.

కాగా, తమ సిబ్బంది. టోరంటోలో అదృశ్యమవడం ఈ ఏడాది ఇది రెండో ఘటన అని పీఏఐ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 2019 నుంచి ఇలాంటి సంఘటనలు మొదలయ్యాయి. గతేడాది ఏకంగా ఏడుగురు అదృశ్యమయ్యారు. వీరంతా కెనడాలో ఆశ్రయం పొందుతున్నట్లు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ భావిస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story