Pakistan : పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ నేడు ప్రమాణ స్వీకారం

Pakistan : పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ నేడు ప్రమాణ స్వీకారం

Pakistan : పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడు షెహవాజ్ షరీఫ్ (72) (Shehwaz Sharif) ఎన్నికయ్యారు. పాక్ పార్లమెంట్లో షెహబాజ్ షరీఫ్కు 201 సభ్యుల మద్దతు లభించింది. పాక్ పార్లమెంటులో మొత్తం 336 సీట్లుండగా ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల అవసరం కాగా, ఆయనకు అంతకంటే ఎక్కువ మంది మద్దతు పలికారు. ఇటీవల పలు వివాదాల నడుమ 265 స్థానాలకు ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీటీఐ 93, పీఎంఎల్-ఎస్ 75, పీపీపీ 54, ఎంక్యూ ఎం-పీ 17, ఇతర పార్టీలు 8 సీట్లు గెలుచుకున్నాయి. పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసి ముందుకు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని నియామకం కోసం ఆదివారం పాక్ పార్లమెంట్ లో ఓటింగ్ నిర్వహిచారు. అందులో అత్యధికులు షెహబాజ్ షరీఫ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ ఓటింగ్ ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్కు కేవలం 92 మంది సభ్యుల మద్దతు లభించింది. ఓటింగ్ సందర్భంగా పార్లమెంట్లో పీటీఐ మద్దతుదారుల నినాదాలతో గందరగోళం నెలకొంది.

ఇమ్రాన్ కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్యే ఓటింగ్ నిర్వహించి విజయం సాధించిన షెహబాజన్ను ప్రధానిగా స్పీకర్ ప్రకటించారు. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ సోమవారం అధ్యక్ష భవనంలో 33వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షెహబాజ్ షరీప్ మొదటిసారి 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించి, ప్రధానిగా పనిచేసిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story