జగన్‌ కాన్వాయ్‌‌ని అడ్డగించిన మహిళ..ఆమెను చూసి..

జగన్‌ కాన్వాయ్‌‌ని అడ్డగించిన మహిళ..ఆమెను చూసి..

వైకాపా అధ్యక్షుడు జగన్‌ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైఎస్‌ జగన్‌కు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. తర్వాత తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకుని అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. జగన్ విమానాశ్రయంకు వెళుతున్న క్రమంలో ఆయన కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. ఆమె వాహన శ్రేణికి అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై మహిళను అడ్డుకున్నారు. వెంటనే ఆమెను పక్కకు లాగేశారు. ఈ పెనుగులాటలో మహిళ చేతికి స్వల్పగాయమైంది. ఈ సంఘటనను గమనించిన జగన్ వాహనం ఆపి మహిళతో మాట్లాడారు. తమది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అని తన భర్తకు ఉద్యోగం కావాలంటూ జగన్‌ని ఆమె కోరారు. ఆమె మాటలను సానుకులంగా విన్న జగన్ ఆమెకు నచ్చజెప్పి అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.

Tags

Next Story