అవంతి శ్రీనివాస్ ఎలా ఎదిగారో ఆరునెలల్లో బయటపెడతా: టీడీపీ సీనియర్ నేత
By - TV5 Telugu |11 Jun 2019 6:40 AM GMT
ఓ ఎమ్మెల్యే తన ఐదేళ్ల పదవీకాలంలో 50కోట్లు సంపాదించారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏ ఆధారాలతో తాను అక్రమాస్తులు సంపాదించానని ఆరోపణలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం తప్ప తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని బండారు సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ , విశాఖలో తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లస్థలాలను కూడా అమ్ముకున్నానే తప్ప ఎలాంటి ఆస్తులను సంపాదించుకోలేదన్నారు. అవంతి శ్రీనివాస్ ఎలా ఎదిగారో ఆరునెలల్లో బయటపెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com