టీడీపీ కార్యకర్త ఇంటిని కూల్చివేసిన వైసీపీ నేతలు

X
ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన వారిపై ఏపీలో రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతల కక్ష సాధింపు కారణంగా కడప జిల్లా చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శంకర్, రేణుక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇంటిని పడగొట్టి.. ఇంటి మధ్యలో రోడ్డు వేసేందుకు స్థానిక వైసీపీ నేతలు ప్రయత్నించారు. పోలీసులను వెంట బెట్టుకుని వచ్చి.. ఇంటి గోడను కూల్చారు. దీంతో మనస్థాపానికి గురైన శంకర్, రేణుక ఆత్మహత్యాయత్నం చేశారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా.. రోడ్డు వేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
