జగన్ మాటలను కోటంరెడ్డి నిజం చేశారు: లోకేశ్

ఏపీ సీఎం జగన్ పాలనపై లోకేశ్ మరోసారి నిప్పులు చెరిగారు. మద్యం మానవసంబంధాలని మంటగలుపుతుందని జగన్ అన్నమాటను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిజం చేశారంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మందుకొట్టి ఒక విలేఖరి ఇంటికి వెళ్ళి అతనిపై చేయిచేసుకుని చంపుతానని అమానుషంగా బెదిరించడమే కాకుండా, జగన్ కూడా తననేమి చేయలేరంటూ వైసీపీ అధినేత పరువును కూడా తీసేసారంటూ లోకేష్ ఆరోపించారు.
మద్యం మానవసంబంధాలని మంటగలుపుతుందని @ysjagan గారు అన్నమాటను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిజం చేశారు. మందుకొట్టి ఒక విలేఖరి ఇంటికి వెళ్ళి అతనిపై చేయిచేసుకుని 'చంపుతా' అని అమానుషంగా బెదిరించడమే కాకుండా, 'జగన్ కూడా నన్నేమీ చేయలేడు' అంటూ వైసీపీ అధినేత పరువును కూడా తీసేసారు. pic.twitter.com/DJUwLRuZFc
— Lokesh Nara (@naralokesh) August 12, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com