బీజేపీకి వైసీపీని దూరం చేసే కుట్ర జరుగుతోంది: అవంతీ శ్రీనివాస్

బీజేపీకి వైసీపీని దూరం చేసే కుట్ర జరుగుతోంది: అవంతీ శ్రీనివాస్
X

AVA

టీడీపీ నేతల విమర్శలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌. తన కంటే హిందూమతాన్ని అమితంగా ప్రేమించేవారు ఎవరూ లేరన్నారు. అయ్యప్ప మాల వేసుకొని చెప్పులతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలకు మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్లే చెప్పులు వేసుకొంటున్నానని తెలిపారు. టీడీపీ నేతలు మతాన్ని రాజకీయానికి వాడుకుంటూ తనపై విమర్శలు చేస్తున్నారని అవంతి ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు, బీజేపీకి వైసీపీని దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. గతంలో మోదీని తిట్టిన టీడీపీ నేతలు.. ఇప్పుడు కేంద్రంపై పొగడ్తలు కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు అవంతి.

Tags

Next Story