రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకపోవటంతో మతాన్ని తెరపైకి తెస్తున్నారు: అంజాద్‌ బాషా

రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకపోవటంతో మతాన్ని తెరపైకి తెస్తున్నారు: అంజాద్‌ బాషా
X

am

ఏపీ సీఎం జగన్‌కి కులం, మతం రంగు పులమడం దారుణమని.. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా అన్నారు. జెరూసలేం యాత్రకు సంబంధించి ఇచ్చిన జీవోపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం దారుణమన్నారు. హజ్‌, జెరూసలేం యాత్రలకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం మంచి ఆలోచనతో చేయూత అందిస్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని కులాలు, మతాలు సమానమే అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుల మతాలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తోందని అన్నారు. విమర్శలు చేయడానికి విపక్షాలకు ఏ అంశం లేకపోవడంతో ఇలా మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని అంజాద్‌ బాషా ఆరోపించారు.

Tags

Next Story