వైసీపీ రంగులు వేయడానికి పోలీస్ స్టేషన్లే మిగిలున్నాయి: నారా లోకేష్

వైసీపీ రంగులు వేయడానికి పోలీస్ స్టేషన్లే మిగిలున్నాయి: నారా లోకేష్
X

lokeshఏపీలో రాక్షస పాలన కొనసాగుతుందంటూ ఘాటు విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్‌ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో స్మశానాలకు రంగులు వెయ్యడం పూర్తి అయ్యిందని.. ఇక పోలీస్ స్టేషన్లే మిగిలున్నాయని అన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే.. వైసీపీ రంగులతో యూనిఫామ్ కుట్టించేలా ఉన్నారని విమర్శించారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పర్యటించారు నారా లోకేష్.. ఆత్మహత్య చేసుకున్నశ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారు. వైసీపీ తప్పుడు కేసుల వల్లే శ్రీనివాస్ బలి అయ్యాడని ఆరోపించారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని అన్నారు లోకేష్. కార్యకర్తలను వేధిస్తున్న వారిపై ప్రైవేటు కేసులు పెడతామని చెప్పారు.

Tags

Next Story