అనంతపురంలో జగన్ పర్యటన

అనంతపురంలో జగన్ పర్యటన
X

4

ఏపీ సీఎం జగన్‌ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పెనుకొండ సమీపంలో ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేసిన దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీని సీఎం ప్రారంభిస్తారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో కియా పరిశ్రమకు చేరుకుంటారు. ప్లాంట్‌ను సందర్శిస్తారు. అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రెస్‌, బాడీ, అసెంబ్లింగ్‌, ఇంజిన్‌షాప్‌, టెస్ట్‌ డ్రైవర్‌ను సీఎం జగన్‌ సందర్శిస్తారు. ఆ తర్వాత కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీలో పాల్గొంటారు. సీఎంతోపాటు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనంతరం పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన వంటి అనేక అంశాలపై కియా ప్రతినిధులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Next Story