రావాలి జగన్.. అన్న వారే ఇప్పుడు పోవాలి అంటున్నారు: తులసీరెడ్డి

రాయల పాలనలో వజ్రాలు రాసులు పోసి అమ్మితే.. ఇప్పటి ముఖ్యమంత్రి హయాంలో ఇసుకను రాసులు పోసి అమ్మే పరిస్థితి ఏపీలో దాపురించిందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారని మండిపడ్డారు. ఇసుక కూడా బంగారంలా మారిపోయిందన్నారు. వైఎస్‌ వివేకా హత్యకేసులో ఇప్పటి వరకు పురోగతి లేదన్నారు. రావాలి జగన్‌ కావాలి జగన్‌ అన్న ప్రజలు ఇప్పుడు ఆయన్ను ఎప్పుడెప్పుడు గద్దె దించుదామా అని ఆలోచిస్తున్నారని తులసిరెడ్డి అన్నారు.

Tags

Next Story