అసెంబ్లీ వేదికగా మద్యంపై మాటల యుద్ధం

X

ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై వాడివేడి చర్చ జరిగింది. ఎక్సైజ్ పాలసీ వైసీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుందని చెప్పారని.. కానీ, పరిమితమైన బ్రాండ్లతో జే.ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు.
టీడీపీ విమర్శలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. అసలు టీడీపీ నేతలకు మద్యపాన నిషేదంపై మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు హయాంలో తాగు.. తాగించు పథకం అమలు చేస్తే.. సీఎం జగన్ ఇప్పుడు మాను.. మాన్పించు అంటూ దీక్ష చేపట్టారన్నారు. తమ ప్రభుత్వం మద్యపాన నిషేదంకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
