దమ్ముంటే ప్రత్యక్షంగా రావాలంటూ చంద్రబాబు సవాల్


దమ్ముంటే ప్రత్యక్షంగా రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. అనంతపురం టీడీపీ సమావేశంలో ఆవేశంగా ప్రసంగించిన ఆయన.. వైసీపీ నేతల్ని ఎక్కడైనా ఎదుర్కొంటామన్నారు. పోలీసులను చూపించి వైసీపీ నేతలు.. తమను భయపెడదామని చూస్తున్నారంటూ ఆరోపించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖామయని, వైసీపీ బాధితులకు వడ్డీతో సహా నష్టపరిహారం కట్టించే బాధ్యత తనదేనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు చంద్రబాబు.
అధికారులు ప్రభుత్వాన్ని కాకుండా చట్టాన్ని గౌరవించాలన్నారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు దారుణంగా వేధిస్తున్నారంటూ మండిపడ్డారాయన. చట్టాలు రక్షించేందుకే పోలీసులున్నారని గుర్తు చేశారు. చట్టాన్ని అతిక్రమించే పోలీసులకు శిక్షలు తప్పవని.. పదవి విరమణ చేసినవారనీ కూడా వదలిపెట్టబోమన్నారు చంద్రబాబు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటిస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

