రాజకీయం, ధర్మం తెలియని వ్యక్తి జగన్: మాజీ మంత్రి

రాజకీయం, ధర్మం తెలియని వ్యక్తి జగన్: మాజీ మంత్రి
X

raj

అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ.. గుంటూరు జిల్లా అరండల్‌ పేట కళ్యాణ మండపంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. రాజధానిని మూడు భాగాలు చేసి ఆనందపడుతున్నారని.. జగన్‌ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. జగన్‌ మొండి వ్యక్తి అని.. రాజకీయం, ధర్మం తెలియని వ్యక్తి అని.. అలాంటి పాలకులకు సత్తా చూపించే సమయం ఆసన్నమైందని రాజా అన్నారు. మరో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు జీఎన్‌రావుపై మండిపడ్డారు. నాలుగేళ్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌గా చేసిన వ్యక్తి తుళ్లూరు ముంపు ప్రాంతమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే మహా ఉద్యమం తప్పదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

Tags

Next Story