ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు: నారా లోకేష్

రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తీసుకునే నిర్ణయం మంచిదైతే.. యుద్ధ వాతావరణం ఎందుకు తీసుకొచ్చారో వైసీపీ మేధావులు చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాజధానిగా అమరావతి ఉంటుందని.. అద్భుతమైన నగరాన్ని కడతామని జగన్ గారు హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని రైతుల శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారని తెలిపారు. అడుగుకో పోలీస్ పెట్టారు. ప్రతి ఇంటి దగ్గర ఐదుగురు పోలీసులా? ముళ్ల కంచెలు, వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్, తుపాకులా? ఏంటిది అని జగన్ ప్రభుత్వాన్ని ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని మండిపడ్డారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com