రాజధాని రైతులను టెర్రరిస్టుల్లా చూస్తున్నారు: లోకేష్
రాజధాని గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటిస్తున్నారు. తుళ్లూరులో పర్యటించిన ఆయన అక్కడ రైతులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన ఒక్క చోటే ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన అన్నారు. కానీ, జగన్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని లోకేష్ మండిపడ్డారు. జగన్ ఉద్దేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే తెలంగాణకు తరలించడమేనా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏ రోజూ రాజధాని గ్రామాల్లో ఒక్క ఆందోళన కూడా జరగలేదన్నారు. కానీ, ఇప్పుడు నిత్యం అరెస్టులతో ఈ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఫైరయ్యారు. రాజధాని గ్రామాల ప్రజలను టెర్రరిస్టుల్లా చూస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com