అలా చేస్తే చంద్రబాబును ఎక్కడా తిరగనీయం: మంత్రి పెద్దిరెడ్డి

అలా చేస్తే చంద్రబాబును ఎక్కడా తిరగనీయం: మంత్రి పెద్దిరెడ్డి

pedsdi-reddy

ఉద్యమం పేరు చెప్పి.. వైసీపీ నేతలపై దాడి చేస్తే చంద్రబాబును ఎక్కడా తిరగనీయమన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. అమరావతి వేదికగా టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌కు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో మేనిఫెస్టో అమలు చేయకపోవడంతోనే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. విశాఖలో రాజధాని పెడితే చంద్రబాబుకు నష్టమేంటని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని ఉంటే వందల కుటుంబాలు బాగుపడతాయని.. అదే మూడు ప్రాంతాల్లో రాజధానులు పెడితే కోట్ల మంది బాగుపడతారన్నారు.

Tags

Next Story