చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. వార్నింగ్ ఇచ్చిన జేసీ

చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. వార్నింగ్ ఇచ్చిన జేసీ

babu

అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబును కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. గోరంట్ల మండలం పాలసముద్రం క్రాస్‌ వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు. అమరావతి వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అటు వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు కాన్వాయ్‌లోని బస్సు నుంచి దిగి.. బస్తీమే సవాల్ అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.

Tags

Next Story