ఈ ప్రభుత్వం శవాల మీద పేలాలు ఏరుకునేలా ఉంది: సీపీఐ నారాయణ

ఈ ప్రభుత్వం శవాల మీద పేలాలు ఏరుకునేలా ఉంది: సీపీఐ నారాయణ

cpi

అమరావతి ఉద్యమం దేశమంతా పాకిందన్నారు సీపీఐ నేత నారాయణ. అందరూ ఒప్పుకున్నాకే అమరావతిని నిర్ణయించారని.. రాజధానిని ఇప్పడెందుకు 3 ముక్కలు చేస్తున్నారని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకునేలా ప్రభుత్వ తీరు ఉందని నారాయణ మండిపడ్డారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని.. మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండన్నారు.

ఎక్కడైనా ధర్నాలు వామపక్షాలు చేస్తాయని.. కానీ సీఎం ప్రజలందరిని ధర్నాలు చేసే విధంగా మార్చారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రానికి సీఎం ఒక గుదిబండలా తయారయ్యారని విమర్శించారు. అమరావతి జోలికి వస్తే జగన్‌ రాజకీయ పతనం ఇక్కడి నుండే ప్రారంభం అవుతుందన్నారు రామకృష్ణ.

Tags

Read MoreRead Less
Next Story