ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎందుకు నిరూపించలేకపోతున్నారు: లోకేష్

రాజధాని తరలింపును ఒప్పుకునేది లేదన్నారు మాజీ మంత్రి లోకేష్. న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, సీపీఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో సీతారామ ఆలయం జంక్షన్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను లోకేశ్ తన బైక్‌పై కూర్చోబెట్టుకొని ర్యాలీగా వెళ్లారు.
ప్రాణాలను పనంగా పెట్టి రాజధాని కోసం పోరాడుతున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి కాని.. రాజధానిని కాదన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఎందుకు నిరూపించలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు.
రాజధాని మార్పుపై జగన్ తన నిర్ణయం మార్చుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారయణ. 31 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా అన్యాయమన్నారు.
ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలన్న జగన్ పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణ చేపట్టరాదన్న జగన్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. మరోవైపు, క్విడ్ ప్రోకో కేసుల్లో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఈ రోజు విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, వచ్చే వారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com