రాష్ట్రానికి జగన్‌ అనే చీడ పట్టింది: పంచుమర్తి అనూరాధ

రాష్ట్రానికి జగన్‌ అనే చీడ పట్టింది: పంచుమర్తి అనూరాధ

panchumarti-anuradha

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి నేర చరిత్రపై పుస్తకమే రాయొచ్చని.. ఆయన చరిత్ర మొత్తం అవినీతి మయమే అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. 2004 నుంచి దొమ్మీ, హత్యాయత్నం వంటి లెక్కలేనన్ని కేసులు ద్వారంపూడిపై ఉన్నాయని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కాలిగోటికి కూడా సరిపోని ద్వారంపూడి ఆయనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రానికి జగన్‌ అనే చీడ పట్టిందని.. అది వదిలినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని అనురాధ వ్యాఖ్యానించారు.

Tags

Next Story