సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురు

సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురు

JAGAN

ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలన్న జగన్ పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణ చేపట్టరాదన్న జగన్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. మరోవైపు, క్విడ్ ప్రోకో కేసుల్లో ఉన్న కంపెనీల ప్రతినిధులు శుక్రవారం విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, వచ్చే వారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

మరోవైపు ఆస్తుల కేసులో ఈ వారినికి హైకోర్టు సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చింది. దీనికి సంబంధించి జగన్‌ డిస్పెన్స్‌‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏపీలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో మినహాయింపు ఇవ్వాలని కోరిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. అయితే ఈ కేసులో ఏ -2 విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐ.ఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలు హాజరయ్యారు.

Tags

Next Story