జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న వ్యక్తిని అలా డొంక రోడ్డులో తిప్పటం దుర్మార్గం: కళా వెంకటరావు

జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న వ్యక్తిని అలా డొంక రోడ్డులో తిప్పటం దుర్మార్గం: కళా వెంకటరావు

KALA

చంద్రబాబు, TDP ఎమ్మెల్యేలు, ఎంపీ జయదేవ్ అరెస్టు దారుణమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. Z+ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రిని డొంకరోడ్డు గుంతల్లో తిప్పటం దుర్మార్గమన్నారు. బులెట్ ప్రూఫ్ వాహనం లేకుండా లైట్లు లేని డొంకరోడ్డు గతుకుల్లో చంద్రబాబు వాహనం తిప్పటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 14 ఏళ్ళు రాష్ట్రానికి 3 సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. రైతుల్ని పరామర్శించి వెళ్లాలని చంద్రబాబు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అనుకోవడం నేరం ఎలా అవుతుందని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని.. ఒక ప్రజాప్రతినిధికి గాయాలయ్యేటట్లు పోలీసులు ప్రవర్తించిన తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags

Next Story