వైసీపీ పిచ్చి తగ్గించడానికి జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది: పవన్

వైసీపీ పిచ్చి తగ్గించడానికి జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది: పవన్

pavan

వైసీపీ పిచ్చి తగ్గించడానికి జనసేన-బీజేపీతో పొత్తు పెట్టుకుంది అన్నారు పవన్‌. 151 సీట్లతో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేంత బలం టీడీపీకి లేదన్నారు. బీజేపీ-జనసేన కలిసి వైసీపీ నియంతృత్వ ధోరణిపై పోరాడుతుందన్నారు. రాజధానిని అమరావతి నుంచి కదలనివ్వమన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని నిలదీశారు. ఒక్క రాజధానికి దిక్కులేదని.. మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని మండిపడ్డారు. ఆంగ్లేయులు వెళ్ళిపోయినా విభజించు పాలించు విధానం వైసీపీ రక్తం నుంచి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ఆరోపించినట్టు అమరావతిలో ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టండని.. అది చేయకుండా రాజధాని మార్చడం ఏంటని పవన్‌ మండిపడ్డారు. ఇక్కడి నుంచి ఉద్యోగులు అక్కడికి వెళితే ఎంత ఖర్చవుతుందో తెలుసా? అని నిలదీశారు.

అమరావతి శాశ్వత రాజధానిగా ఇక్కడే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు. వైపీపీ గతంలో ప్రతిపక్ష హోదాలో ఉండి 2015లో ఎందుకు భూసేకరణ అడ్డుకోలేదని నిలదీశారు. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో రాజధాని మార్పు చేయడంలేదని అక్కడి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే రాజధాని అంటున్నారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని.. అందకే రాజధాని ఇక్కడే ఉండాలన్నారు. రాజధాని మార్పునకు కేంద్రం ఒప్పుకుందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. నమస్కారం పెడితే రాజధానికి ఒప్పుకొన్నట్లు కాదన్నారు. రాజధాని నిర్ణయం సరైనదైతే ఇంతమంది పోలీసుల్ని ఎందుకు మోహరిస్తున్నారని ప్రశ్నించారు.

అంతకుముందు రాజధాని గ్రామాల పర్యటనకు సిద్ధమైన జనసేన అధినేత పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం గేటు వద్దే ఆయన్ను అడ్డగించారు. పవన్ తో పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు భారీగా జనసేన కార్యకర్తలు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

Tags

Read MoreRead Less
Next Story