ఆంధ్రప్రదేశ్

తెరపైకి రూల్ 71.. టీడీపీ వ్యూహంతో శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్

తెరపైకి రూల్ 71.. టీడీపీ వ్యూహంతో శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్
X

yanamakla

శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించిన టీడీపీ దీనిపై చర్చకు పట్టుపట్టింది. మండలిలో రూల్ 71 పెట్టే అధికారం లేదని, ప్రభుత్వ బిజినెస్‌కి ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన చెప్పారు. దీంతో రూల్ 71ను చదివి వినిపించారు యనమల. తర్వాత మెజార్టీ లెక్కించి తీర్మానం ప్రవేశపెట్టేందుకు బలం ఉందని నిర్థారించారు. ప్రస్తుతం ఈ తీర్మానంపై చర్చ మొదలైంది. యనమల మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం పెట్టిన 2 బిల్లుల్లోని సారాంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇక సాంకేతికంగా చూస్తే ఈ తీర్మానంపై చర్చను ఆమోదించడం అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించి నట్టేనంటున్నారు నిపుణులు. రూల్ 71ని తొలిసారిగా ఉపయోగించుకున్న టీడీపీ వ్యూహంతో.. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. వికేంద్రీకరణ బిల్లుపై ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతోంది.

Next Story

RELATED STORIES