22 Jan 2020 5:25 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / స్పీకర్, అధికారపక్ష...

స్పీకర్, అధికారపక్ష సభ్యుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

స్పీకర్, అధికారపక్ష సభ్యుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ
X

స్పీకర్, అధికారపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌కు తెలుగుదేశం శాసనసభా పక్షం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసింది. అప్రజాస్వామికంగా సభను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సంప్రదాయం, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని.. పక్షపాత ధోరణితో, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం అసెంబ్లీ జరిగిన తీరు, స్పీకర్ వైఖరిపై టీడీపీ సభ్యులు లేఖలో ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష సభ్యులను దూషిస్తున్నారు. చెయ్యి‌ చేసుకుంటున్నారని.. ఇంత జరుగుతున్నా స్పీకర్ మౌనంగా చూస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను.. సీఎం మాపై దాడికి ప్రోత్సహిస్తున్నారని.. లాబీల్లో ప్రతిపక్ష సభ్యుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారుని ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చూసేందుకు లైవ్ ఆపేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Next Story