మండలిలో నిర్ణయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తాం: బొత్స

మండలిలో నిర్ణయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తాం: బొత్స

మండలిలో నిర్ణయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు మంత్రి బొత్స. బుధవారం జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. మండలి చైర్మన్‌ తీరు దారుణంగా ఉందని ఆరోపించారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్దమని ఆవేదన వ్యక్తం చేశారు.

సంఖ్యాబలం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎలా అని బొత్స ప్రశ్నించారు. మండలిలో టీడీపీ సభ్యుల తీరు అప్రజాస్వామికమని ఆరోపించారు. ప్రజల ముందే టీడీపీ తీరును ఎండగడతామన్నారు. మండలిలో జరిగిన విషయాన్ని యనమల వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా తమ నిర్ణయంపై ముందుకే వెళ్తామన్నారు. టీడీపీ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించడంతోనే మండలి రద్దు చేసే ఆలోచన చేయాల్సి వస్తోంది అన్నారు. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags

Next Story