ఆంధ్రప్రదేశ్

వైసీపీ తీరుపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్సీలు

వైసీపీ తీరుపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్సీలు
X

శాసన మండలిలో ఏం జరుగుతుందో తెలియకుండా ప్రసారాలు నిలిపేశారన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు. మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. తెలుగుజాతి కోసం మండలి ఛైర్మన్‌ షరీఫ్‌.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించారన్నారు బచ్చుల అర్జునుడు. సభలో ఛైర్మన్‌కు మంత్రులు నరకయాతన చూపించారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఛైర్మన్‌ గదిలో ఏం పని అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు.

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాముపోరాటం చేస్తున్నామన్నారు మరో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి. టీడీపీ సభ్యులపై వైసీపీ సభ్యులు, మంత్రులు తీవ్రంగా దుర్భాషలాడారని విమర్శించారాయన.

మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతాయన్నారు ఎమ్మెల్సీ అశోక్‌బాబు. రాజ్యంగ ఉల్లంఘన జరిగిందంటూ విమర్శించే మంత్రులు.. ముందుగా చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. వైసీపీకి అధికారం ఆ చట్టం ద్వారానే వచ్చిందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

Next Story

RELATED STORIES